విశాఖ – చెన్నై కారిడార్ కు ADB ఋణం రూ.3,500 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం

No Comment Yet

విశాఖ – చెన్నై కారిడార్ కు ADB ఋణం
రూ.3,500 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం
ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)కి చెందిన భారతదేశ ప్రతినిధుల బృందం మంగళవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయింది. విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక కారిడార్‌ కోసం రూ.3500 కోట్ల రుణమిచ్చేందుకు ఏడీబీ అంగీకరించింది. అంతేకాకుండా గ్రామీణ రహదారులు, తాగునీరు, ఓడరేవుల అనుసంధానం, రవాణా, విద్యుత్తు, పట్టణ ప్రణాళిక తదితర రంగాల్లో రాష్ట్రానికి రుణం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషి ఎంతో బాగుందని ఏడీబీ కంట్రీ డైరెక్టర్‌ టెరెసా ఖో తెలిపారు. విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను త్వరితగతిన పూర్తి చేసేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరగా ముఖ్యమంత్రి అందుకు అంగీకరించారు.

dailyreport

Author

dailyreport

Up Next

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *