విశాఖలో విధ్వంసం

No Comment Yet
323 Views

విశాఖలో విధ్వంసం

సాగర తీరం పరుగుల సునామీతో హోరెత్తింది. ఫోర్లు, సిక్సర్లతో విశాఖపట్నం పోటెత్తింది. బ్యాట్‌కు తగలడమే తరువాయి బంతులు వేగంగా బౌండరీలు దాటాయి. చెన్నైలో దెబ్బ తిన్న తర్వాత టీమిండియా తగిన రీతిలో జవాబిచి్చంది. ముందుగా రోహిత్, రాహుల్‌ అద్భుత సెంచరీలకు అయ్యర్, పంత్‌ దూకుడైన బ్యాటింగ్‌ తోడు కావడంతో భారత్‌ భారీ స్కోరుతో ప్రత్యరి్థకి సవాల్‌ విసిరింది. ఆ తర్వాత మిగతా పనిని మన బౌలర్లు పూర్తి చేశారు.

వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఓటమి నుంచి భారత్‌ వెంటనే కోలుకుంది. బుధవారం ఇక్కడి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 107 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రోహిత్‌ శర్మ (138 బంతుల్లో 159; 17 ఫోర్లు, 5 సిక్సర్లు), లోకేశ్‌ రాహుల్‌ (104 బంతుల్లో 102; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలతో కదం తొక్కారు.

వీరిద్దరు తొలి వికెట్‌కు 227 పరుగులు జోడించడం విశేషం. శ్రేయస్‌ అయ్యర్‌ (32 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), రిషభ్‌ పంత్‌ (16 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా భారీ స్కోరులో కీలక పాత్ర పోషించారు. అనంతరం విండీస్‌ 43.3 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. షై హోప్‌ (85 బంతుల్లో 78; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), నికోలస్‌ పూరన్‌ (47 బంతుల్లో 75; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేయగా, కీమో పాల్‌ (42 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. షమీ, కుల్దీప్‌ యాదవ్‌ చెరో 3 వికెట్లు తీశారు.  తాజా ఫలితంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. చివరిదైన మూడో వన్డే మ్యాచ్‌ ఆదివారం కటక్‌లో జరుగుతుంది.

dailyreport

Author

dailyreport

Up Next

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *