విజయవాడ మెట్రోరైలుకు జులైనాటికి జైకా రుణం

No Comment Yet
మెట్రో రైల్‌ ప్రాజెక్టు రుణానికి సంబంధించి జపాన్ ఆర్థిక సంస్థ ‘జైకా’ మరో రెండు నెలల్లో చర్యలకు సంకేతాలిచ్చింది. జూన్, జూలై మాసాల్లో రూ.4200 కోట్ల రుణానికి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చి దశల వారీగా నిధులను బదలాయించే అవకాశాలున్నాయని జపాన్ ప్రతినిధులు సంకేతాలు ఇవ్వటం
గమనార్హం.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
మెట్రో ప్రాజెక్టుకు తుది అనుమతులు ఇవ్వలేదన్న కారణంగా కేంద్ర వాటా నిధులు రాలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులు వెన్నాడుతున్నాయి. భూ సేకరణకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో దశల వారీగా వీటిని విడుదల చేసేందుకు నిధుల సర్దుబాటు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ దశలో మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు తక్షణం జైకా రుణం మంజూరైతే తప్ప పనులు ప్రారంభించలేని పరిస్థితి ఏర్పడింది. జపాన ఆర్థిక సంస్థ జైకా దశల వారీగా వేర్వేరు రంగాలు, సాంకేతిక అంశాలకు సంబంధించిన బృందాలనుఒక్కొక్కటిగా విజయవాడ పంపుతూ ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయనం చేస్తోంది. అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన(ఏఎంఆర్‌సీ), ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన (డీఎంఆర్‌సీ) ఉన్నతాధికారులు జపాన నుంచి వస్తున్న జైకా బృందాలకు వారు కోరుకున్న అంశాలకు సంబంధించిన అంశాలపై సమాచారం ఇస్తూ క్షేత్రస్థాయిలో కారిడార్లలో తిప్పుతూ అవగాహన కల్పిస్తున్నారు.
బెజవాడకు జపాన్‌ బృందం
తాజాగా జపాన నుంచి ఐదో బృందం నగరానికి వచ్చింది. ఇకేగామి, సొనోబే, ఫుకునామా, త్సుజి తదితరులు గురువారం విజయవాడ వచ్చారు. అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన కార్యాలయంలో సాంకేతిక అంశా లకు సంబంధించి చర్చించారు. మెట్రో రైల్‌ కారిడార్లను పరిశీలించారు. పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషనదగ్గర నిర్మించనున్న మెట్రో ప్రధాన స్టేషన ప్రాంతాన్ని పరిశీలించారు. డిజైన్లను పరిశీలించారు. సాంకేతికాంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏఎంఆర్‌సీ ఎండీ పి.రామకృష్ణారెడ్డి, డీఎంఆర్‌సీ , డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్‌ పాండు రంగారావులు జపాన బృందానికి పలు అంశాలపై అవగాహన కల్పించారు.
భూ సేకరణకు దశల వారీగా నిధులు
మెట్రో రైల్‌ ప్రాజెక్టు భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సిన రూ.700 కోట్ల దశల వారీగా నిధులను విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిధులను ఏపీసీసీఎండీసీ ద్వారా హడ్కో నుంచి రుణం తీసుకుని సర్దుబాటు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. మొదటి విడతగా రూ. 150 కోట్లను విడుదల చేయాలని నిర్ణయించారు. జూనలో ఈ మొత్తం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. జూనలో నిధులు విడుదల చేసిన తర్వాత వరుస నెలల్లో వాయిదాల చొప్పున నిధులు సర్దుబాటు చేయాలని నిర్ణయించారు.
dailyreport

Author

dailyreport

Up Next

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *