‘మహానగరాల కంటే ఇక్కడ బంగారం ధర తక్కువ’

No Comment Yet
323 Views

‘మహానగరాల కంటే ఇక్కడ బంగారం ధర తక్కువ’

 బెంగళూరుకు చెందిన రతన్‌సింగ్‌ అనే బంగారు వ్యాపారి సూట్‌కేసులో సుమారు 2.2 కిలోల బంగారు నగలను ప్రొద్దుటూరుకు తీసుకొని వచ్చాడు. మైదుకూరు రోడ్డులో వెళ్తూ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా వెంటపడి  పట్టుకున్నారు. పోలీసు అధికారులు ప్రశ్నించగా తన పేరు రతన్‌సింగ్‌ అని, బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చినట్లు తెలిపాడు. తరచూ ప్రొద్దుటూరు, కడపలోని దుకాణాల్లో బంగారు నగలను విక్రయిస్తున్నానని చెప్పాడు. బిల్లులు చూపించమని అడగ్గా తెల్లముఖం వేశాడు. పోలీసులు నగలను స్వాధీనం చేసుకున్నారు. నగలను పోలీసులు కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులకు అప్పగించారు.

బంగారం కేసు ఐటీకి అప్పగింత
కడప అర్బన్‌: కడపలో ఈనెల 21న కారులో బయట పడిన బంగారు ఆభరణాల కేసును పోలీసులు ఆదాయ పన్ను శాఖకు అప్పగించారు. కడప అర్బన్‌ సీఐ ఎస్‌కెఎం ఆలీ శుక్రవారం ఈ విషయం తెలిపారు.  కడప నగరంలో టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కారు వెనుకసీటులో రహస్యంగా బాక్స్‌ను ఏర్పాటు చేసుకుని రూ.3 కోట్ల విలువైన ఏడు కిలోల బంగారు ఆభరణాలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. నెల్లూరు పట్టణంలోని మౌనిక జ్యుయెలర్స్‌ పేరుతో ఉన్న  బిల్లులను మాత్రం కారులోని ముగ్గురు వ్యక్తులు చూపించారు. ఆదాయపన్నుకు సంబంధించిన వ్యవహారం కావడంతో బంగారాన్ని పోలీసులు సీజ్‌ చేసి కేసు విచారణ బాధ్యతలను తిరుపతిలోని ఆదాయపన్ను శాఖ ఏడీ రాజారావుకు అప్పగించారు.
►కొన్ని రోజుల క్రితం చెన్నై నుంచి సుమారు 3 కిలోల బంగారు నగలను తీసుకు వస్తున్న వారిని ఎర్రగుంట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  బిల్లులు లేకపోవడంతో కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులకు అప్పగించారు.
►కొన్ని రోజుల క్రితం కోయంబత్తూరుకు చెందిన ముకుందరాజన్‌ అనే వ్యాపారి నుంచి నలుగురు వ్యక్తులు పోలీసు వేషంలో వచ్చి టోకరా వేశారు. రూ.21 లక్షల విలువైన బంగారం దోపిడీ చేశారు. వ్యాపారి కోయంబత్తూరు నుంచి జయంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రొద్దుటూరుకు బయలుదేరగా పోలీసు దుస్తుల్లో రైలు ఎక్కి వ్యాపారి బ్యాగులను తనిఖీ చేశారు. బంగారు అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందని రెండు మొబైల్‌ ఫోన్లు, చేతిలో బంగారు నగల బ్యాగును లాక్కొని వెళ్లారు.. ఇలాంటి ఉదంతాలు ప్రొద్దుటూరు బంగారు వ్యాపారంలో చాలా ఉన్నాయి. ప్రొద్దుటూరు పసిడి వ్యాపారానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుంది. రాష్ట్రంలో ఎక్కడ బంగారం పట్టుబడ్డా ప్రొద్దుటూరుకు ముడిపడి ఉంటుంది. తులం, రెండు తులాలు కాదు  ఎక్కడ బంగారం పట్టుబడ్డా కేజీల్లోనే ఉంటుంది.

కడపలో స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు(ఫైల్‌)

(this content taken from sakshi news)
dailyreport

Author

dailyreport

Up Next

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *