నేడు ఏపీ కేబినెట్‌ భేటీ..

No Comment Yet
289 Views

నేడు ఏపీ కేబినెట్‌ భేటీ..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అభివృద్ధి వికేంద్రీకరణపై జీఎన్‌ రావు కమిటీ అందజేసిన నివేదికతో పాటు పలు కీలక అంశాలను చర్చించనున్నారు. కొత్తగా 104, 108 వాహనాల కొనుగోలు, దేవాలయాల్లో పాలక మండళ్ల నియామకాలకు సంబంధించి సవరణలపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది.

అలాగే స్థానిక ఎన్నికల్లో అమలు చేయాల్సిన రిజర్వేషన్లపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. రాష్ట్రంలో ప్రత్యేక ఎకనామిక్‌ జోన్ల ఏర్పాటు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. కేబినెట్‌ సమావేశానికి మందు మంత్రివర్గ ఉపసంఘం సీఎం జగన్‌తో భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిపై సీఎంకు మంత్రివర్గ ఉపసంఘం ఓ నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం.

(this news is taken from sakshi news)

dailyreport

Author

dailyreport

Up Next

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *