ఆయేషా మీరా కేసు: శ్మశానవాటికకు పోలీసులు

No Comment Yet
319 Views

ఆయేషా మీరా కేసు: శ్మశానవాటికకు పోలీసులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా ఉదంతం విచారణలో భాగంగా.. సీబీఐ అధికారులు ఆమె మృతదేహానికి రీపోస్ట్‌మార్టం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తెనాలి చెంచుపేటలోని శ్మశానవాటికలో మరోసారి శనివారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తెనాలి త్రీటౌన్‌ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాగా 12 ఏళ్ల క్రితం అత్యంత దారుణ పరిస్థితుల్లో ఆయేషా శవంగా మారిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆమె మృతిపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తగా దర్యాప్తునకై సీబీఐ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో విచారణలో భాగంగా.. ఆరు నెలల క్రితమే ఆయేషా మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించడానికి సీబీఐ అధికారులు సిద్ధపడగా.. మత పెద్దలు అంగీకరించడం లేదంటూ ఆయేషా తల్లిదండ్రులు చెప్పడంతో.. వారు వెనక్కి తగ్గారు. దీంతో కోర్టు ఉత్తర్వులతోనే ముందుకు సాగుతామని అప్పట్లోనే ప్రకటించారు.

ఈ క్రమంలో ఆయేషా తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించగా… రీపోస్టుమార్టం చేయడానికి అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో డిసెంబరు 14న రీపోస్టుమార్టం నిర్వహించేందుకు తమకు సహకరించాలని సీబీఐ అధికారులు తెనాలి సబ్‌ కలెక్టర్‌కు గురువారం లేఖ రాశారు. ఈ క్రమంలో తెనాలి చెంచుపేటలోని ఈద్గా మైదానాన్ని తహశీల్దార్‌ కె.రవిబాబు, ఇతర అధికారులు, పోలీసులు శుక్రవారం పరిశీలించి ఆయేషా సమాధిని గుర్తించారు. ఇక మరోవైపు ఆయేషా రీపోస్టుమార్టం గురించి తమకు సమాచారం అందలేదని ఆయేషా తల్లి శంషాద్‌ బేగం అన్నారు. అయితే రీపోస్టుమార్టం చేసేందుకు తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు.

(this content taken from hindu news)

dailyreport

Author

dailyreport

Up Next

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *